Wednesday, September 21, 2016

2016 batch VBMC

జీవితంలో నిలదొక్కుకోవాలి అంటే
ఎంత కష్టపడాలో ఈ పాటికి అర్థమై ఉంటుందనుకుంటాను ..
ఎందుకంటే ..
 రాష్ట్రం విడిపోయిన  తరుణంలో 
ఇద్దరు చంద్రుల పాలనలో
నువ్వు ఎంత అంటే నేను అంత అనే వాతావరణంలో
ఎంసెట్ వద్దు నీట్ యే ముద్దు అని కేంద్రం అంటే
నీట్ యే వద్దు ఎంసెట్ ముద్దు అని రాష్ట్రాలు , ప్రైవేట్ కళాశాలలు అంటే ..
నీట్ నీట్గా ఉంటుంది కదా అని  సుప్రీమ్  చివరకు అంటే
నువ్వా నేనా సై అని కొట్టుకుంటుంటే
ఎటు పోవాలో ఏం వ్రాయాలో అని
అటు విద్యార్థులకు ఇటు పేరెంట్స్కు అర్థంకాని సమయంలో
నీట్ 1 అని డేట్ కేంద్రం ఇస్తే  ,,
ఎంసెట్ 1 అని రాష్ట్రం ఇవ్వసాగింది .
నీట్ 2 అని కేంద్రం ప్రకటిస్తే ,,
సై అని ఎంసెట్ 2 అని  రాష్టం  పెట్టసాగింది .
ఈ గోడే ఎక్కువ అని అనుకుంటుంటే
వచ్చింది మహమ్మారి పేపర్ లీక్ అని
ఐతే మల్లి రాయండి ఎంసెట్ 3 అని చావు దెబ్బ చల్లగా చెప్పారు మన పెద్దలు
మొత్తానికేమి అన్ని exam లు వ్రాసి
మాకు మేమే సాటి
లేదు మాకు పోటీ
మీ సై అందుకోండి మా డీ అని చెప్పి
నీట్ గా మెడికల్ కాలేజీ లో చేరిన
మీకందరికి నా హార్దిక శుభాకాంక్షలు .!

Welcoming u  all to a professional  course
Wishing u all best wishes for ur future .