Monday, February 7, 2011

A Tribute To Our Beloved Revathi Akka

ప్రభువే సర్వస్వముగా భావించి
నీ సర్వస్వాన్ని ప్రభుకై అర్పించి
ప్రభువు కోసం సమస్తమును త్యాగం చేసి
ఆత్మల రక్షణయే నీ సంపదగా తలచి
ప్రభు సేవలో పరితపించి
ప్రభువు వైపే నీ గమ్యం ఉంఛి 
ప్రభువు కోసం గొప్ప సాక్షిగా జీవిస్తూ
నీవు కనపరచిన ప్రేమతో 
ఎందరో ఆత్మీయులను సంపాదించి
ఓ అక్కగా మాకందరికీ చేరువై
మా హృదయాలను దోచి  
ఈ లోకంలో నీ పరుగు తుదముట్టించి
నీ తనువు  చాలించి
నీ నీడ మాకు వదిలి
ప్రభువు చెంతకు చేరి
మాకందరికీ కన్నీటితో నిండిన
ఆనందాన్ని మిగిల్చినా...
పరలోకంలో నిన్ను కలుసుకుంటాం అన్న
ఆశతో ఈ లోకంలో జీవితం కొనసాగిస్తామని
నిన్ను ఎన్నటికి మరువమని
మా హృదయమనే ఆలయంలో
సదా నిన్ను గుర్తుపెట్టుకుంట్టామని
మాట ఇస్తూ ............

                        Rapha Fellowship
                            NELLORE



No comments:

Post a Comment