Sunday, November 20, 2016

PARENTS ARE UR WELL WISHERS

తలిదండ్రుల ఆశలను అడియాశలు చేయకండి,
మీఫై వారికి ఉన్న నమ్మకాని వమ్ము చేయకండి ..
వారి కష్టాన్ని గుర్తించండి.
వారి కలలను సాకారం చేయడం మీ బాధ్యతని జ్ఞాపకముంచుకోండి
వారు కష్టపడేది మీకోసమని
సంపాదించే ప్రతి పైసా మీ భవిష్యత్తు కోసమని
వారి ఆస్తి పాస్తులు డబ్బు , కాగితాలు కాదని
వాటిని మించిన ఆస్తి మీకంటే, వారికి ఎవరున్నారని ఆలోచించండి .
వారి సర్వస్వమూ మీరని ,
వారి ప్రాణాలు మీపై పెట్టుకొని జీవిస్తున్నారని ..
మీ ప్రవర్తన వారి పెంపకాన్ని సూచిస్తుందని గుర్తెరిగి
మీ నడవడికను, మీ అడుగులను , మీ ఆలోచనలను
ఎల్లప్పుడూ గమనించుకుంటూ
మీ తలిదండ్రులు  తల ఎత్తుకొని జీవింపచేసే పిల్లలుగా ఉండాలి కానీ
వారు తలదించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండకూడదని కోరుకుంటున్నాను

Tuesday, October 25, 2016

SUICIDE IS SIN --

జీవితం ఎంతో విలువైనది
సాధించాల్సినది ఎంతో ఉన్నది !
అర్థాంతరంగా జీవితం ముగించడం
అర్థరహితం కాదా !!

చిన్న చిన్న వాటికీ బలార్పణం అంటే
ఈ లోకంలో మనుష్యజాతి ఏదొకనాటికి
అంతరించి పోవాల్సిందే కదా !!

ఒంటరిగా నిందను భరించితివే
అసహ్యపు అనరాని మాటలను పడితివే
ఓ క్షణం నీ భర్తకో  ,నీ వాళకో ,
నీ ప్రాణ మిత్రులకో చెప్పాలనిపించలేదా !!

నిన్ను నమ్ముకున్న నీ తలిదండ్రులని
నీ వెంటే ఉంటానని చెప్పిన నీ భర్తని
నీ  మిత్రులను వదిలి వెళ్లిపోవాలని
ఆలోచన వచ్చినప్పుడే ఓ క్షణం ఆలోచించక పోతివా ...
నీ ఆలోచన తప్పని ,,నీవు  చేసేది తప్పని !!

Suicide is  SIN !!
Never think of it when u r alone or when u are in a off mood and half mind !!

All Are Equal

తెల్లగా ఉన్నానని మురిసిపోకు
నల్లగా ఉన్నానని కృంగిపోకు
బాహ్యసౌందర్యం కన్నా
ఆత్మసౌందర్యం కాదా ఎంతో మిన్నా..
మనిషి రూపం దైవస్వరూపపు ప్రతిరూపం
మనుష్యులందరు ఒకటే అని చెప్పే ప్రతిబింబం
మనుష్యులందరిలో ఉండేది ఒకే ఎరుపెక్కిన రక్తం
మనుష్యులందరిలో ఉండాలి ఒకే ధ్యేయం  ..
అదే అందరి పట్ల స్నేహ భావం !

మానవత్వంతో ముందుకు సాగుదాం
అందరితో కలిసి స్నేహంగా ఉందాం !!

మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం !!


Wednesday, September 21, 2016

2016 batch VBMC

జీవితంలో నిలదొక్కుకోవాలి అంటే
ఎంత కష్టపడాలో ఈ పాటికి అర్థమై ఉంటుందనుకుంటాను ..
ఎందుకంటే ..
 రాష్ట్రం విడిపోయిన  తరుణంలో 
ఇద్దరు చంద్రుల పాలనలో
నువ్వు ఎంత అంటే నేను అంత అనే వాతావరణంలో
ఎంసెట్ వద్దు నీట్ యే ముద్దు అని కేంద్రం అంటే
నీట్ యే వద్దు ఎంసెట్ ముద్దు అని రాష్ట్రాలు , ప్రైవేట్ కళాశాలలు అంటే ..
నీట్ నీట్గా ఉంటుంది కదా అని  సుప్రీమ్  చివరకు అంటే
నువ్వా నేనా సై అని కొట్టుకుంటుంటే
ఎటు పోవాలో ఏం వ్రాయాలో అని
అటు విద్యార్థులకు ఇటు పేరెంట్స్కు అర్థంకాని సమయంలో
నీట్ 1 అని డేట్ కేంద్రం ఇస్తే  ,,
ఎంసెట్ 1 అని రాష్ట్రం ఇవ్వసాగింది .
నీట్ 2 అని కేంద్రం ప్రకటిస్తే ,,
సై అని ఎంసెట్ 2 అని  రాష్టం  పెట్టసాగింది .
ఈ గోడే ఎక్కువ అని అనుకుంటుంటే
వచ్చింది మహమ్మారి పేపర్ లీక్ అని
ఐతే మల్లి రాయండి ఎంసెట్ 3 అని చావు దెబ్బ చల్లగా చెప్పారు మన పెద్దలు
మొత్తానికేమి అన్ని exam లు వ్రాసి
మాకు మేమే సాటి
లేదు మాకు పోటీ
మీ సై అందుకోండి మా డీ అని చెప్పి
నీట్ గా మెడికల్ కాలేజీ లో చేరిన
మీకందరికి నా హార్దిక శుభాకాంక్షలు .!

Welcoming u  all to a professional  course
Wishing u all best wishes for ur future .