Saturday, April 7, 2018


ఎక్కినవేమో కొన్ని...  
ఎక్కాల్సినవేమో మరెన్నో ..
వెనుతిరుగకూ  ..
తడబడకు  ..
ఆశయ సాధనకై ..
కార్యసాధకుడవై ..
అలుపెరుగక ..
ముందుకు  సాగు !

Still Much to  go...
All the best

Sunday, November 20, 2016

PARENTS ARE UR WELL WISHERS

తలిదండ్రుల ఆశలను అడియాశలు చేయకండి,
మీఫై వారికి ఉన్న నమ్మకాని వమ్ము చేయకండి ..
వారి కష్టాన్ని గుర్తించండి.
వారి కలలను సాకారం చేయడం మీ బాధ్యతని జ్ఞాపకముంచుకోండి
వారు కష్టపడేది మీకోసమని
సంపాదించే ప్రతి పైసా మీ భవిష్యత్తు కోసమని
వారి ఆస్తి పాస్తులు డబ్బు , కాగితాలు కాదని
వాటిని మించిన ఆస్తి మీకంటే, వారికి ఎవరున్నారని ఆలోచించండి .
వారి సర్వస్వమూ మీరని ,
వారి ప్రాణాలు మీపై పెట్టుకొని జీవిస్తున్నారని ..
మీ ప్రవర్తన వారి పెంపకాన్ని సూచిస్తుందని గుర్తెరిగి
మీ నడవడికను, మీ అడుగులను , మీ ఆలోచనలను
ఎల్లప్పుడూ గమనించుకుంటూ
మీ తలిదండ్రులు  తల ఎత్తుకొని జీవింపచేసే పిల్లలుగా ఉండాలి కానీ
వారు తలదించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండకూడదని కోరుకుంటున్నాను

Tuesday, October 25, 2016

SUICIDE IS SIN --

జీవితం ఎంతో విలువైనది
సాధించాల్సినది ఎంతో ఉన్నది !
అర్థాంతరంగా జీవితం ముగించడం
అర్థరహితం కాదా !!

చిన్న చిన్న వాటికీ బలార్పణం అంటే
ఈ లోకంలో మనుష్యజాతి ఏదొకనాటికి
అంతరించి పోవాల్సిందే కదా !!

ఒంటరిగా నిందను భరించితివే
అసహ్యపు అనరాని మాటలను పడితివే
ఓ క్షణం నీ భర్తకో  ,నీ వాళకో ,
నీ ప్రాణ మిత్రులకో చెప్పాలనిపించలేదా !!

నిన్ను నమ్ముకున్న నీ తలిదండ్రులని
నీ వెంటే ఉంటానని చెప్పిన నీ భర్తని
నీ  మిత్రులను వదిలి వెళ్లిపోవాలని
ఆలోచన వచ్చినప్పుడే ఓ క్షణం ఆలోచించక పోతివా ...
నీ ఆలోచన తప్పని ,,నీవు  చేసేది తప్పని !!

Suicide is  SIN !!
Never think of it when u r alone or when u are in a off mood and half mind !!

All Are Equal

తెల్లగా ఉన్నానని మురిసిపోకు
నల్లగా ఉన్నానని కృంగిపోకు
బాహ్యసౌందర్యం కన్నా
ఆత్మసౌందర్యం కాదా ఎంతో మిన్నా..
మనిషి రూపం దైవస్వరూపపు ప్రతిరూపం
మనుష్యులందరు ఒకటే అని చెప్పే ప్రతిబింబం
మనుష్యులందరిలో ఉండేది ఒకే ఎరుపెక్కిన రక్తం
మనుష్యులందరిలో ఉండాలి ఒకే ధ్యేయం  ..
అదే అందరి పట్ల స్నేహ భావం !

మానవత్వంతో ముందుకు సాగుదాం
అందరితో కలిసి స్నేహంగా ఉందాం !!

మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం !!


Wednesday, September 21, 2016

2016 batch VBMC

జీవితంలో నిలదొక్కుకోవాలి అంటే
ఎంత కష్టపడాలో ఈ పాటికి అర్థమై ఉంటుందనుకుంటాను ..
ఎందుకంటే ..
 రాష్ట్రం విడిపోయిన  తరుణంలో 
ఇద్దరు చంద్రుల పాలనలో
నువ్వు ఎంత అంటే నేను అంత అనే వాతావరణంలో
ఎంసెట్ వద్దు నీట్ యే ముద్దు అని కేంద్రం అంటే
నీట్ యే వద్దు ఎంసెట్ ముద్దు అని రాష్ట్రాలు , ప్రైవేట్ కళాశాలలు అంటే ..
నీట్ నీట్గా ఉంటుంది కదా అని  సుప్రీమ్  చివరకు అంటే
నువ్వా నేనా సై అని కొట్టుకుంటుంటే
ఎటు పోవాలో ఏం వ్రాయాలో అని
అటు విద్యార్థులకు ఇటు పేరెంట్స్కు అర్థంకాని సమయంలో
నీట్ 1 అని డేట్ కేంద్రం ఇస్తే  ,,
ఎంసెట్ 1 అని రాష్ట్రం ఇవ్వసాగింది .
నీట్ 2 అని కేంద్రం ప్రకటిస్తే ,,
సై అని ఎంసెట్ 2 అని  రాష్టం  పెట్టసాగింది .
ఈ గోడే ఎక్కువ అని అనుకుంటుంటే
వచ్చింది మహమ్మారి పేపర్ లీక్ అని
ఐతే మల్లి రాయండి ఎంసెట్ 3 అని చావు దెబ్బ చల్లగా చెప్పారు మన పెద్దలు
మొత్తానికేమి అన్ని exam లు వ్రాసి
మాకు మేమే సాటి
లేదు మాకు పోటీ
మీ సై అందుకోండి మా డీ అని చెప్పి
నీట్ గా మెడికల్ కాలేజీ లో చేరిన
మీకందరికి నా హార్దిక శుభాకాంక్షలు .!

Welcoming u  all to a professional  course
Wishing u all best wishes for ur future .




Saturday, January 3, 2015

HAPPY NEW YEAR 2015

ఈ నుతనసంవత్సరంలో ..
ఏ  పనైనా ...
ఆశతో ఆరంబించు
ఆచరణతో  నిరూపించు 
శ్రద్ధతో ముందుకుసాగు
ఆలోచనలతో లక్ష్యాన్ని చేదింఛి... 
మీ కలలను సొంతం చేసుకోవాలని కోరుకుంటూ  ...
మీకు నూతనసంవత్సర శుభాకాంక్షలు !!

HAPPY NEW YEAR




Wednesday, September 24, 2014

ఏమి అవ్వాలనో ..
ఏమి కావాలనో.. 
దేనిని కోరుక్కోనో.. 
దేనిని ఆశించో ..
ఏమి సాధించాలనో  ..
మీరు కష్టపడి ఇకడికి అడుగులు వేసారో ...
ఆ అడుగులు  తడపడకుండా.. 
మీరు సాధించాలనుకున్న దానిని సాదించెదిశగ
మీ అడుగులను, మీ మనసులన్ను, మీ దృష్టిని  ఉంచండి
తపక్క విజయం సాదిస్తారు !!

Have  Cordiality towards your Friends
Have Patience towards yours Patients
Have Relation with your Seniors
Have Respect towards yours Teachers !!

All  the Best!!

Thursday, June 26, 2014

1st HAPPY BIRTHDAY 

దేవుని దీవెనలు
ఆనందపు కేరింతలు ..
తొలకరి తుల్లింతలు ..
కనుపాపకు కనువిందులు..
 తల్లిదండ్రుల సంతోషాలు
 జెస్సీ (JESSIE)..యొక్క  మొదటి పుట్టిన రోజు !!


Let the  little children come to me .. Mathew 19 : 24

దేవుని కృపా హస్థములలొ ఎదుగుతూ ...
ఆశ్రయం .. ఆనందము .. ఆశీర్వాదములకు
పాత్రురాలివి కావాలని ఆశీర్వదిస్తూ ...

From
Amarhema

Friday, May 9, 2014

నువ్వు - నేను
కలిసి మెలిసి
జతగా నిలిచి'
ఒక్కటై - ఒక్కటిగా
వేసిన ప్రతి అడుగులోను
నడిచిన ప్రతి బాటలోను
పీల్చిన ప్రతి శ్వాసలోను
ఆలోచించిన ప్రతి ఆలోచనలోను
యేసయ్య మనకు తోడుగానుంటూ
మన మధ్యలో నివాసముంటూ
ఆయన రెక్కల చాటున మనలను
సంవత్సరమంతయు కాపాడి
మేలులను కలుగజేసి
ప్రేమను - ఆప్యాయతను
క్షేమమును - సంతోషమును
ఆరోగ్యమును - ఆనందమును
మన జీవితాలలో కలుగజేసిన
నా దేవుడు ; మన రక్షకుడైన
యేసయ్య ఘన నామమును
హెచ్చిస్తూ ... స్తుతిస్తూ .. జీవిస్తూ ..
క్రీస్తూ  పరిమళ సువాసనగా
ఈ లోకంలో ఆయన నామమును వెదజల్లుతూ ..
ఆయన పిల్లలుగా .. క్రీస్తూ వరాసులుగానుండు
కృపను మనకు కలుగజేయాలని .. 
ఇది మొదలుకొని
రానున్న కాలములోను , ప్రతి యేటలోను
ఆయన కృపను విస్తరింపజేసి
ఆయన దివ్యమైన సన్నిధిలో
మనలను .. మన కుటుంబాలను
నిలబెట్టి , కాపాడాలని
ఆ దేవున్ని ప్రార్థిస్తూ
మన వివాహ మొదటి వార్షికముననుబట్టి
నీకు .. నాకు  పెనవేసి ముడివేసిన
క్రీస్తూ ప్రేమానుబంధమునుబట్టి
నా దేవునికి క్రుతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
నీకు 1st Marriage Anniversary Best Wishes తెలుపుతూ
ఈ మొదటి వివాహ  వార్శికము ఒక ఉత్సవములా
ఓ మధురానుభూతిగ  .. ఓ  మదుర క్షనముగా
మన జీవితాలలో .. మన హృదయాలలో 
మన కళ్ళలో .. మన కలలలో
నిత్యం నిలవాలని
ఆయన సన్నిధిలో సదా నిలిపి
సకల సమ్రుధిన్ని
 శ్రేయ్స్తమైన ఆశిర్వాదములను
నీపై ..నాపై , మనపై ,
మన  కుటుంబాలపై
ఇప్పుడును .. ఎలప్పుడును
కుమ్మరిమ్పబడునుగాక !!
    .... Amen ,,! Amen ...! Amen..!

let His glorious name be exalted through our lives,
and Let His Immense Grace ..Presence, ..Peace..Protection..&  His  Everlasting Love
be with Us and bless Us & our families and let our lives be a Living Sacrifice to  God..

On this Special day Of !st Marriage Anniversary wishing U special geetings and Best wishes
                                                                                                     from
                                                                                          Amar and Family members
God Bless U





Monday, April 7, 2014

చిన్ని బుర్రలో వేళ్ళ ఆలోచనలు
కొన్ని మంచివి కొన్ని చెడ్డవి
చెడ్డ ఆలోచనలు అల్ప సంతోశాన్నిస్తే
దొడ్డ ఆలోచనలు నిత్య సంతోశానిస్తాయి
మంచి ఆలోచనలు ..
ఉల్లాస్సమైన మనస్సు ..
మంచి పౌష్టికాహారం ..
మంచి వ్యాయామం ..
మంచి నిద్ర ..
మంచి ఆరోగ్యనిస్థాయి !!

మంచి ఆరోగ్యం .. మంచి జీవితం
A good health ..to a  good life..

Wishes on World Health day.

 అందరికి ఆరోగ్యం అందచేయడం మన బాద్యత !

Saturday, March 15, 2014

WHO WINS

మనిషి నిర్మాణం అద్బుతం
మనిషి  స్వభావం అగమ్యగోచరం
మనిషి హృదయములో పుట్టు కోరికలు  అనేకం
వాటిని జయించిన వాడే ... కార్యసాధకుడు !!

Thursday, February 27, 2014

which is important EYE or HEART

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు
సర్వేంద్రియానాం హృదయం పదిలం అన్నారు జ్ఞానులు
కళ్ళు లేకున్నా హృదయంతో ఈలోకాన్ని చూడవచ్చు
అదే హృదయం స్థిరముగా లేకపోతే ..
నీ కళ్ళతో నువ్వు చూస్తూవున్న
నీ లోకం చీకటిమయం
నీ జీవితం అంధకారామయం !!
కాబట్టి ,,
కళ్ళతో,, హృదయంతో , ఈలోకాన్ని చూడూ ...
అందమైన నీ జీవితం, ఇంద్రధనస్సులా  మెరుస్తుంది !!!

Friday, February 14, 2014

what to hear in your ear

ఉత్తి మాటలు కట్టి పెట్టు ..
సద్ది మాటలు పక్కన పెట్టు ..
చెడ్డ మాటలు చెవిన  పెట్టకు ..
 వినిన మంచి మాటలు మనసున  పెట్టు ..
అప్పుడు  ,,
నీ లక్ష్యం ... నీ గమ్యమౌతుంది ,,
నీ గమ్యం ... నీ విజయమౌతుంది !

Thursday, January 30, 2014

HOW A MAN CAN BECOME A HUMAN

ఎదిగే వయస్సుతో ఎదగనివాలి నీ మనసును
ఎదిగే వయస్సుతో ఎదగనివాలి నీ బుద్ధిని..
ఎదిగే వయస్సుతో ఎదగనివాలి నీ జ్ఞానమును..
ఎదిగే వయస్సుతో ఎదగనివాలి నీ భాద్యతను..
అప్పుడే....
నీవు పరిపూర్ణ   వ్యక్తివి ... మనస్సున్న మారాజువి !!

Tuesday, September 10, 2013


ప్రతి విషయంఫై అవగాహన పెట్టుకో

ముఖ్యమైన వాటిపై శ్రద్ధ ఉంచుకో

అర్థంకాని వాటిని క్షుణ్ణంగా తెలుసుకో 

అర్తమైనవాటిని విశ్లేషించుకో 

సమయం వృధా చేయకు 

పోయిన సమయం తిరిగిరాదని గుర్తుపెట్టుకో !


ALL THE BEST !!

Wednesday, June 26, 2013

dibbalamma retirement

To,
  Dibbalamma...

ఇహలోక యాత్రలో
ఎన్ని ఇరుకులున్నా , అర్థంకాని మలుపులు ఎన్నున్నా ..
దివ్యమైన , బలమైన మన కాపరి దక్షిణ హస్తం తోడై ఉండా ..
కృప విస్థరించును , కృపా క్షేమములు వెన్నంట్టే  వచ్చును..
ప్రతి మలుపు వద్ద ఆనంద తలుపులు స్వాగతము పలుకుచూ
మీ జీవితమును ఆనందింపజేయాలని మా ప్రార్థన  . !

అట్టువంటి కృప దేవుడు మీ జీవితములో , మీ కుటుంబములో అనుగ్రహించును గాక.!

  Wish U a happy & joyful  retirement life ahead.....
God Bless U

from
Amarhema & family members

Wednesday, February 27, 2013

HOW GOD MAKES LIFE BEAUTIFUL

i was trying to pluck a beautiful flower from the branches of a tall tree.. but i lost my balance and fell into a pond. i was disappointed. my  eyes were closed with tears . but when i regained calmness, i saw many beautiful lotus floating around me.
this is LIFE.
God makes u fall at times 2 fill ur life with good Virtues.
God takes away what u desire 2 give u what u deserve.
just believe in HIm always.  AMEN

Sunday, February 24, 2013

HOW TO BEHAVE

మనిషై పుట్టిన నీవు ఓ మనిషిలా
ఆలోచించు , ప్రవతించు , జీవించు ...
ఓ మృగంలా  , రాక్షసునిలా  వివేచన లేనివానిలా 
ఆలోచించకు  , ప్రవతించకు  , జీవించకు  .!

మనిషై పుట్టిన నీవు ఓ మనిషిలా 
ఆలోచించు , ప్రవర్తించు , జీవించు .. 
ఓ మృగంలా , రాక్షసునిలా , వివేచానలేనివనిలా 
ఆలోచించకు  , ప్రవర్తించకు జీవించకు !!



Tuesday, February 19, 2013

YOUR TEARS ARE PERCIOUS in the SIGHT OF GOD

కష్టాలకు ఏమి తెలుసు నీ కన్నీళ్ళ  విలువా
నిన్ను సృష్టించిన యేసయ్యకు తప్పా
ఆయన  నీ ప్రతి కన్నీరు బొట్టును లెక్కబెట్టి 
తన కవిలెలో దాచి  ఉంచెను గదా !